వైఎస్ జగన్ ప్రకాశం జిల్లా పర్యటనను విజయవంతం చేయాలని గిద్దలూరు వైసీపీ ఇన్చార్జ్ కె.పి నాగార్జున రెడ్డి కోరారు. మంగళవారం గిద్దలూరులోని పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ పొగాకు రైతుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. వాటిని స్వయంగా తెలుసుకునేందుకు జగన్ పొదిలికి వస్తున్నారని కార్యకర్తలు తప్పకుండా పాల్గొనాలని కోరారు.