గిద్దలూరు: మాజీ సీఎంని కలిసిన వైసిపి నాయకులు

75చూసినవారు
గిద్దలూరు: మాజీ సీఎంని కలిసిన వైసిపి నాయకులు
గిద్దలూరు వైసీపీ నాయకులు పిడతల ప్రవీణ్ కుమార్ రెడ్డి మాజీ ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. బుధవారం తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ లో మాజీ సీఎం ని కలిశారు. నియోజకవర్గం రాజకీయ పరిస్థితులను మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రవీణ్ కుమార్ రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని మాజీ సీఎం పిడతల ప్రవీణ్ కుమార్ రెడ్డికి సూచించారు.

సంబంధిత పోస్ట్