అర్ధవీడు: విద్యార్థులకు అవగాహన కార్యక్రమం

81చూసినవారు
అర్ధవీడు: విద్యార్థులకు అవగాహన కార్యక్రమం
ప్రకాశం జిల్లా అర్ధవీడులోని గురుకుల పాఠశాలలో సోమవారం జిల్లా ఎస్పీ దామోదర్ విద్యార్థులకు మత్తు పదార్థాలపై అవగాహన కల్పించారు. విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత శిఖరాలకు ఎదగాలని తల్లిదండ్రులు తమపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయరాదని అన్నారు. మత్తు పదార్థాలకు బానిసై తమ విలువైన భవిష్యత్తు పాడు చేసుకోవద్దని ఎస్పీ విద్యార్థులకు తెలిపారు. కార్యక్రమంలో డిఎస్పి నాగరాజు, సీఐ మల్లికార్జునరావు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్