అర్ధవీడు: పులుల సంచారం పై అప్రమత్తం

63చూసినవారు
ప్రకాశం జిల్లా అర్ధవీడులో పులుల సంచారం పై స్థానిక ప్రజలకు అటవీశాఖ అధికారులు శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అడవులు, వన్యప్రాణులు, అడవుల సంరక్షణ వంటి అంశాలపై జానపద గీతాలతో ప్రజలకు అవగాహన కల్పించారు. అడవులకు నిప్పు పెడితే కలుగు అనర్ధాలను ప్రజలకు తెలిపారు. పులుల సంచారం పెరిగిన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాటికి హాని తలపెట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు, సలహాలు ఇచ్చారు.

సంబంధిత పోస్ట్