ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం మాగుటూరు గ్రామంలో మంగళవారం విషాదం చోటుచేసుకుంది. ఇంటి ఆవరణలో నిద్రిస్తున్న పెద్దిరాజు (52) అనే వ్యక్తిని పాముకాటు వేసింది. పెద్దిరాజును మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రధమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఒంగోలు లోని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అక్కడ పెద్దిరాజు మృతి చెందినట్లుగా అర్ధవీడు ఎస్ఐ సుదర్శన్ తెలిపారు.