అర్ధవీడులోని కస్తూరి భా పాఠశాల ప్రాంగణంలో రూ.1.59 కోట్లతో జూనియర్ కళాశాల కొత్త భవనం నిర్మించనున్నారు. ఈ నేపథ్యంలో గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి మంగళవారం భూమి పూజ నిర్వహించి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. సీఎం చంద్రబాబు అభివృద్ధికి ప్రతీక అని ఆయన నేతృత్వంలోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు.