కంభం మండలంలోని ఎర్రబాలెం అంగన్వాడి కేంద్రంలో పోషణ పక్వాడ పక్షోత్సవాల్లో భాగంగా 3వ రోజు కిచెన్ గార్డెన్ ప్రాముఖ్యత, రక్తహీనతపై తల్లులకు అవగాహన కలిగించారు. సీడీపీవో నీలోఫర్ బేగం మాట్లాడుతూ ప్రకృతి సిద్ధమైన పెరటి తోటలు ఆరోగ్యానికి బహుళ ప్రయోజకంగా ఉంటాయన్నారు. కందులాపురం బీసి బాలికల వసతి గృహంలో కిశోర బాలికలకు రక్తహీనత, వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కలిగించారు. కార్యక్రమంలో సూపర్ వైజర్ నాగ చెంచులక్ష్మి ఉన్నారు.