అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా బుధవారం స్థానిక అర్బన్ కాలనీలో అగ్ని ప్రమాదాలపై అవగాహన కలిగించారు. ప్రమాదం జరిగిన వెంటనే ఆందోళన పడకుండా ఆలోచనతో అగ్ని ప్రమాదాలను అరికట్టే నైపుణ్యాలను ప్రయోగాత్మకంగా వివరించారు. గ్యాస్ సిలిండర్ వాడుకలో అప్రమత్తంగా ఉండాలని, పొరపాటున ప్రమాదం జరిగితే తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. కార్యక్రమంలో అగ్నిమాపక అధికారి డి. పి. చౌదరి, సిబ్బంది పాల్గొన్నారు.