కంభంలోని వాసవి జూనియర్ కళాశాలలో గురువారం సిఐ మల్లికార్జున విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. అపరిచిత వ్యక్తులు ఫోన్ చేసి వ్యక్తిగత బ్యాంక్ డీటెయిల్స్ లేదా ఓటీపీ నెంబర్ అడిగితే చెప్పవద్దని అన్నారు. బంపర్ ఆఫర్ గెలుచుకున్నారని అమాయక ప్రజలకు సైబర్ నేరగాళ్లు వలవేస్తున్నారని ఇటువంటి విషయాలలో జాగ్రత్తగా ఉండాలన్నారు. సైబర్ నేరాల బారిన పడితే 1930 నంబర్ కు ఫోన్ చేయాలని సిఐ విద్యార్థులకు తెలిపారు.