కంభం: ఆటో డ్రైవర్ కు కౌన్సెలింగ్

84చూసినవారు
కంభం: ఆటో డ్రైవర్ కు కౌన్సెలింగ్
ప్రకాశం జిల్లా కంభంలో శనివారం ఎస్ఐ నరసింహారావు వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లకు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఆటోలో అత్యధికంగా ప్యాసింజర్లను తరలిస్తున్న విషయాన్ని గుర్తించిన ఎస్ఐ నరసింహారావు ఆటో డ్రైవర్ ను మందలించారు. పరిమితికి మించి ఆటోలలో ప్రయాణికులను తరలించరాదని డ్రైవర్లను తీవ్రంగా హెచ్చరించారు. మరల ఇటువంటి తప్పు జరిగితే ఆటోను సీజ్ చేస్తామని ఆయన ఆటో డ్రైవర్లకు వార్నింగ్ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్