కంభం మండలం పోరుమామిళ్లపల్లి లో మంగళవారం పట్టపగలే గ్రామానికి చెందిన శేఖర్ ఇంటిలో రూ. 2 లక్షల నగదు, 7 తులాల బంగారం, 300 గ్రాముల వెండి దొంగలు దోచుకు వెళ్లారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దొంగతనం జరిగిన సమయంలో ఊరి చివరిలో ఓ కారు ఉన్న విషయాన్ని పోలీసులు సీసీ కెమెరాలో గుర్తించారు. దొంగలే ఆ కారును అక్కడ నిలిపి ఉంచారని పోలీసులు అనుమాన వ్యక్తం చేస్తున్నారు.