కంభం: గోవా మద్యాన్ని స్వాధీనం చేసుకున్న ఎక్సైజ్ అధికారులు

201చూసినవారు
ప్రకాశం జిల్లా కంభం రైల్వే స్టేషన్ లో శనివారం అక్రమంగా తరలిస్తున్న 4. 7 లీటర్ల గోవా మద్యాన్ని ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రైల్వే పోలీసులతో రైల్వే స్టేషన్ ని తనిఖీ చేస్తుండగా ఓ వ్యక్తి మద్యం కలిగి ఉన్న బ్యాగును వదిలి పరారయ్యాడని ఎక్సైజ్ సీఐ కొండారెడ్డి తెలిపారు. గోవా మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నామని నిందితుడిని దర్యాప్తులో గుర్తించి పట్టుకుంటామని సీఐ మీడియాకు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్