ప్రకాశం జిల్లా కంభం మండలం జంగంగుంట్ల అమరావతి అనంతపురం జాతీయ రహదారిపై బుధవారం ఓ కారు అదుపుతప్పి బోల్తా పడ్డ సంఘటన చోటుచేసుకుంది. ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 5 మంది గాయాల పాలయ్యారు. గాయపడ్డ వారిలో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు. గాయపడ్డ వారిని అంబులెన్స్ లో కంభం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. క్షతగాత్రులు బేస్తవారిపేట మండలం పెద్ద ఓబినేని పల్లి గ్రామానికి చెందిన వ్యక్తులుగా గుర్తించారు.