కంభం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎంఈవో బి. మాల్యాద్రి అధ్యక్షతన మంగళవారం నిర్వహించిన మండల స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఎంపీపీ. చేగిరెడ్డి తులసమ్మ, జడ్పిటిసి. కొత్తపల్లి జ్యోతి, సర్పంచి రజిని రిబ్బన్ కట్టింగ్ చేసి వైజ్ఞానిక ప్రదర్శనలను ప్రారంభించారు. మండలంలోని పలు పాఠశాలల విద్యార్థులు ప్రదర్శించిన ప్రయోగాల ప్రాజెక్టులను అందరూ ఆసక్తిగా తిలకించారు.