ఉన్నత చదువులకు ఉర్దూ మాధ్యమమే ఉత్తమమని కంభం గవర్నమెంట్ హైస్కూల్ ఉపాధ్యాయులు హబిబుర్ రహమాన్, మస్తాన్ వలి అన్నారు. మండలంలోని స్థానిక నాయక్ వీధి, పార్కువీధి, రంగావీధి, చౌక్ సెంటర్లోని ఉర్దూ మీడియం పాఠశాలల్లో 5 తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులందరూ కంభం గవర్నమెంట్ హైస్కూల్లో 6వ తరగతి ఉర్దూ మీడియంలో చదివేలా విద్యార్థులకు అవగహన కల్పించారు. ఎట్టి పరిస్థితిలో విద్యను మధ్యలో ఆపవద్దన్నారు.