నంద్యాలకు చెందిన పవన్ నవీన్ గౌడ్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోసం చేపట్టిన పాదయాత్ర ప్రకాశం జిల్లా కంభంకు బుధవారం చేరుకుంది. 2024 ఎన్నికలలో పవన్ కళ్యాణ్ విజయం సాధిస్తే కాలినడకన ఇంద్రకీలాద్రికి నడిచి వస్తానని అమ్మవారికి పవన్ నవీన్ గౌడ్ మొక్కు పెట్టుకున్నాడు. భావాన్ని మాల ధరించి ఇంద్రకీలాద్రి కి కాలి నడకన బయలుదేరాడు. డిప్యూటీ సీఎం ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని వేడుకుంటానని అభిమాని తెలిపాడు.