కంభం: పకడ్బందీగా గురుకులం ప్రవేశ పరీక్ష

71చూసినవారు
కంభం: పకడ్బందీగా గురుకులం ప్రవేశ పరీక్ష
కంభంలో సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలలో 5వ తరగతి ప్రవేశ పరీక్షను ఆదివారం పకడ్బందీగా నిర్వహించారు. మండల విద్యాశాఖ అధికారి బి. మాల్యాద్రి పరీక్షల నిర్వహణను పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు. ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు ఉచితంగా విద్య, వసతి, క్రీడా సౌకర్యాలను అందించనున్నట్లు ఎంఈవో తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ పి. చాముండేశ్వరి ఉన్నారు.

సంబంధిత పోస్ట్