కంభం మండలం రావిపాడుకు చెందిన ఆర్మీ జవాన్ వరికుంట్ల సుబ్బయ్య ఈనెల 9న జమ్ము కాశ్మీర్ లో విధులు నిర్వహిస్తుండగా ల్యాండ్ మైన్ బాంబుపై కాలు వేసి అది పేలడంతో మృతి చెందాడు. తాను చనిపోతూ 30 మందిని సుబ్బయ్య రక్షించాడు. ఇప్పటికే అధికార అంచనాలతో సుబ్బయ్యకు అధికారులు అంత్యక్రియలు పూర్తి చేశారు. గ్రామస్తులు మరో మారు ఆర్మీ జవాన్ సుబ్బయ్యను స్మరిస్తూ గురువారం విద్యార్థులతో కలిసి భారీ సంతాప ర్యాలీ చేపట్టారు.