ప్రకాశం జిల్లా కంభంలో బిజెపి, ఆర్ఎస్ఎస్ నాయకులు జనవరి 5వ తేదీన విజయవాడలో జరగనున్న హైందవ శంఖారావం సభను విజయవంతం చేయాలని శనివారం పిలుపునిచ్చారు. కంభం పట్టణంలోని కందులాపురం సెంటర్ లో ప్రదర్శన నిర్వహించి విజయవాడకు తరలిరావాలని ప్రజలకు బిజెపి నాయకులకు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కొంతమంది ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ద్విచక్ర వాహనంపై విజయవాడకు బయలుదేరారు. కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్, బిజెపి నాయకులు పాల్గొన్నారు.