కంభం: మహిళ మెడలో బంగారు గొలుసు చోరీ

68చూసినవారు
కంభం: మహిళ మెడలో బంగారు గొలుసు చోరీ
కంభం పట్టణంలోని కల్కి భగవాన్ నగర్ లో మంగళవారం గుర్తుతెలియని వ్యక్తి నడిచి వెళుతున్న ఓ మహిళ మెడలో నుంచి బంగారు గొలుసు చోరీ చేసి పరారయ్యాడు. పట్టణానికి చెందిన హుస్సేనమ్మ అనే మహిళ చర్చికి వెళ్లి తిరిగి ఇంటికి వెళుతున్న క్రమంలో ఈ ఘటన జరిగింది. బాధితురాలు వెంటనే స్థానిక పోలీసులను ఆశ్రయించడంతో పోలీసులు జరిగిన సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. 4రోజుల క్రితం ఓ మహిళ మెడలో ఇలానే బంగారు గొలుసు చోరీ అయింది.

సంబంధిత పోస్ట్