కొండపి: గిట్టుబాటు ధర లేక రైతులు ఆవేదన

63చూసినవారు
కొండపి: గిట్టుబాటు ధర లేక రైతులు ఆవేదన
కొండపి పొగాకు వేలం కేంద్రంలో బుధవారం నిర్వహించిన వేలంలో పొగాకు సరాసరి ధర కేజీ రూ 245. 14పలికిందని వేలం నిర్వహణ అధికారి సునీల్ కుమార్ తెలిపారు. గుర్రప్పడియ, మూగచింతల, చతుకుపాడు, కె. అగ్రహారం, నెన్నూరుపాడు కు చెందిన రైతులు వేలానికి 1227 బేళ్లను తీసుకొని వచ్చారు. అందులో 885 బేళ్లు కొనుగోలు అయ్యాయి. వివిధ కారణాలతో 342 బేళ్లను తిరస్కరించారు. గిట్టుబాటు ధర లభించలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్