పిచ్చి మొక్కలు తొలగించాలని స్థానిక ప్రజలు డిమాండ్

77చూసినవారు
పిచ్చి మొక్కలు తొలగించాలని స్థానిక ప్రజలు డిమాండ్
ప్రకాశం జిల్లా గిద్దలూరు నగర పంచాయతీ పరిధిలోని సరస్వతి స్కూల్ సమీపంలో రోడ్డుకు ఇరువైపులా పెరిగిన పిచ్చి మొక్కలను తక్షణమే తొలగించాలంటూ స్థానిక ప్రజలు మంగళవారం సంబంధిత అధికారులను విజ్ఞప్తి చేశారు. విపరీతంగా పెరిగిన పిచ్చి మొక్కలతో ఈ రోడ్డులో నడిచేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానిక ప్రజలు అన్నారు. విషపురుగులు కూడా ఈ ప్రాంతంలో తిరుగుతూ ఉండడంతో అధికారులు తక్షణమే స్పందించాలన్నారు.

సంబంధిత పోస్ట్