ప్రకాశం జిల్లా మార్కాపురంలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి కళ్యాణ మహోత్సవం వేడుకలు ఆదివారం ఘనంగా జరుగుతున్నాయి. కార్యక్రమానికి ముందు స్థానిక ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి స్వామి వారికి పట్టు వస్త్రాలు తలంబ్రాలు సమర్పించారు. అనంతరం నిర్వహించిన పూజా కార్యక్రమాలలో ఎమ్మెల్యే పాల్గొని అర్చకులు అందించిన తీర్థప్రసాదాలు స్వీకరించారు. లక్ష్మీ చెన్నకేశవ స్వామి కల్యాణానికి భక్తులు భారీగా తరలివచ్చారు.