ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో బుధవారం సిఐటియు నాయకుల ఆధ్వర్యంలో ముఠా కార్మికుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు మాట్లాడుతూ ముఠా కార్మికులకు సంక్షేమ బోర్డు ప్రభుత్వం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. పెన్షన్ అందించడంతో పాటు ప్రమాద బీమా కల్పించాలని అలానే ముఠా కార్మికులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో ముఠా కార్మికులు పాల్గొన్నారు.