గిద్దలూరులో రూ. 10 నాణ్యంపై ప్రజలకు అపోహలు ఇంకా వీడలేదు. గతంలో 10 నాణ్యం చెల్లదంటూ సోషల్ మీడియాలో పుకార్ల షికారు చేయడంతో వ్యాపార సముదాయాలలో రూ. 10 నాణ్యం తీసుకునేందుకు ప్రజలు ఆసక్తి చూపించలేదు. మార్కెట్లో నాణ్యం చలామణి అవుతున్న ఇంకా కొంతమంది అపోహలు విడలేదని పది రూపాయల నాణ్యాలు తీసుకునేందుకు అంగీకరించడం లేదని వ్యాపారస్తులు తెలిపారు. అధికారులు ప్రజలకు మరింత అవగాహన కల్పించాల్సి ఉందన్నారు.