అన్న క్యాంటీన్ ని ప్రారంభించిన ఎమ్మెల్యే అశోక్ రెడ్డి

59చూసినవారు
అన్న క్యాంటీన్ ని ప్రారంభించిన ఎమ్మెల్యే అశోక్ రెడ్డి
ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని అన్నా క్యాంటీన్ ని గురువారం ఎమ్మెల్యే అశోక్ రెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. తర్వాత స్వయంగా ప్రజలకు ఆహారాన్ని వడ్డించి అన్న క్యాంటీన్ లోని ప్రజలకు అందిస్తున్న ఆహారాన్ని రుచి చూశారు. కేవలం ఐదు రూపాయలకే మూడు పూటల పేదల కడుపు నింపేందుకు కూటమి ప్రభుత్వం అన్నా క్యాంటీన్ ని ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు. కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్