గిద్దలూరు పర్యటనలో భాగంగా ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి శనివారం గిద్దలూరుకు చేరుకున్నారు. స్థానిక నాయకులు కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ముందుగా గిద్దలూరు పట్టణంలోని అమ్మవారి శాలలో అమ్మవారిని దర్శించుకుని తర్వాత రాచర్ల మండలంలోని శ్రీ నెమలిగుండ్ల రంగనాయక స్వామి ఆలయంలో నిర్వహించే పూజా కార్యక్రమాలలో ఎంపీ పాల్గొంటారు. ఆయనతోపాటు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి కూడా కార్యక్రమానికి హాజరుకానున్నారు.