పిచ్చి మొక్కలను తొలగించిన అధికారులు

71చూసినవారు
పిచ్చి మొక్కలను తొలగించిన అధికారులు
గిద్దలూరు నగర పంచాయతీ పరిధిలోని సరస్వతీ స్కూల్ సమీపంలో రోడ్డుకు ఇరువైపున పెరిగిన పిచ్చి మొక్కలతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్న సమాచారంతో నగర పంచాయతీ అధికారులు మంగళవారం చర్యలు తీసుకున్నారు. రోడ్డుకు ఇరువైపున పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించారు. స్థానిక ప్రజలు పెరిగిన పిచ్చి మొక్కలతో విషపురుగులు వస్తాయని తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అధికారుల స్పందించి పిచ్చి మొక్కలు తొలగించారు.

సంబంధిత పోస్ట్