రాచర్ల మండలం సత్య వోలు గ్రామ రైల్వే బ్రిడ్జి సమీపంలో సత్య వోలు గ్రామానికి చెందిన పెద్ద పోలయ్య అనే వృద్ధుడు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మనస్థాపం చెంది మంగళవారం రాత్రి ఇంటి నుంచి వెళ్లి రైలు కింద పడి మృతి చెందాడు. బుధవారం రైల్వే ట్రాక్ వెంట మృతదేహాన్ని గమనించి కుటుంబ సభ్యులు రైల్వే పోలీసులకు సమాచారం అందించగా వారు అక్కడికి చేరుకొని కేసు నమోదు చేసి పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.