ప్రకాశం జిల్లా పొదిలి మండలం సకలనూతల గ్రామంలో మద్యం బెల్టు షాపు ఏర్పాటు చేసుకొని మద్యం విక్రయిస్తున్న ఓ వ్యక్తిని గురువారం వదిలి ఎస్సై అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి వద్ద నుంచి 10 క్వార్టర్ల మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నామని అనంతరం మద్యం అమ్ముతున్న వ్యక్తిపై కేసు నమోదు చేశామని ఎస్సై చెప్పారు. మద్యం బెల్టు షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పొదిలి ఎస్సై ప్రజలను హెచ్చరించారు.