ప్రకాశం జిల్లా కంభంలో శనివారం సీఐ మల్లికార్జునరావు ట్రాఫిక్ సమస్యపై దృష్టి సారించారు. పట్టణంలో ట్రాఫిక్ కు అంతరాయం కలిగిస్తున్న వ్యాపారులకు ఆయన వార్నింగ్ ఇచ్చారు. రోడ్డుకు అడ్డంగా పెట్టి వ్యాపారాలు చేస్తున్న వ్యాపార సముదాలకు సంబంధించిన సామాగ్రిని రోడ్డుపై నుంచి తొలగించారు. ఉద్దేశపూర్వకంగా రోడ్డు పై దుకాణదారులు తమ వస్తువులు పెడితే జరిమానా విధిస్తామని సీఐ మల్లికార్జున రావు వారిని హెచ్చరించారు.