ప్రకాశం జిల్లా గిద్దలూరు సబ్ డివిజన్ పరిధిలోని సంజీవరావుపేట విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలోని ఉయ్యాలవాడ, ఆదిములపల్లి, గడికోట, లింగాపురం గ్రామాలలో మరమ్మతులు చేపట్టనున్నారు. దీంతో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు విద్యుత్ శాఖ అధికారి శేషగిరిరావు శుక్రవారం తెలిపారు. శనివారం ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 11: 30 వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోతుందన్నారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.