రాచర్ల: దేవుడిపై నమ్మకంతో కంపలో దొర్లిన భక్తులు

57చూసినవారు
రాచర్ల మండలం యడవల్లిలో శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మంగళవారం స్వామివారికి ప్రత్యేక కార్యక్రమమైన కంప బండి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చెన్నకేశవ స్వామి పేరు గలిగిన వ్యక్తులు కంపలు దొర్లి తమ భక్తిని చాటుకుంటారు. 24 సంవత్సరాల తర్వాత మళ్లీ ఈ కార్యక్రమం జరగడంతో దాదాపు 15 వేలమంది భక్తులు తరలివచ్చి శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామిని దర్శించుకున్నారు.

సంబంధిత పోస్ట్