6 రోజులుగా రాచర్ల మండలం యడవల్లిలో శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మంగళవారం బ్రహ్మోత్సవాలలో ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజ కార్యక్రమాలలో పాల్గొని తర్వాత స్వామివారి పల్లకిని ఎమ్మెల్యే మూసి భక్తిని చాటుకున్నారు. 24 సంవత్సరాల తర్వాత ఈ బ్రహ్మోత్సవాలు నిర్వహించడంపై అశోక్ రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు.