రాచర్ల మండలం జేపీ చెరువు గ్రామ సమీపంలోని నెమలిగుండ్ల రంగనాయక స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆఖరి రోజు సోమవారం రథోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే అశోక్ రెడ్డి తో పాటు గిద్దలూరు జనసేన పార్టీ ఇన్ ఛార్జ్ బెల్లంకొండ సాయిబాబు పాల్గొన్నారు. భాజా భజంత్రీలు వేద మంత్రాల మధ్య రథోత్సవం ఘనంగా జరిగింది. కార్యక్రమం తిలకించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు.