ప్రకాశం జిల్లా రాచర్ల మండలం జే పి చెరువు గ్రామ సమీపంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ నెమలిగుండ్ల రంగనాయక స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి. చివరి రోజైన సోమవారం స్వామివారికి తెప్పోత్సవం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి హాజరయ్యారు. ఈ బ్రహ్మోత్సవాల్లో దాదాపు 60 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు.