ప్రకాశం జిల్లా రాచర్ల మండలం పలుగూటి పల్లి వద్ద ఈనెల 9వ తేదీన ద్విచక్ర వాహనం అదుపుతప్పి క్రింద పడిన సంఘటనలో ఎడవల్లి గ్రామానికి చెందిన వెంకటరమణ తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని మొదట గిద్దలూరుకు తరలించి ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు తరలించారు. దాదాపు ఆరు రోజులపాటు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ వెంకటరమణ మృతి చెందినట్లుగా రాచర్ల ఎస్సై కోటేశ్వరావు బుధవారం తెలిపారు.