రాచర్ల మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన నెమలిగుండ్ల రంగనాయక స్వామి ఆలయానికి వచ్చినా భక్తులు భారీ వర్షంతో ఆలయం వద్ద చిక్కుకుపోయారు. శనివారం కావడంతో భక్తులు వెయ్యి మందికి పైగా ఆలయానికి వచ్చారు. భారీ వృక్షాలు రోడ్డుకు అడ్డంగా పడటంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న రాచర్ల పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని రోడ్డుకు అడ్డంగా పడి ఉన్న వృక్షాలను తొలగించి భక్తులను ఇళ్ళకు పంపారు.