రాచర్ల: నేటికీ మిస్టరీగా మారిన నీటి గుండం లోతు

692చూసినవారు
రాచర్ల మండలం జేపి చెరువు సమీపంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ నెమలి గుండ్ల రంగనాయక స్వామి ఆలయ వద్ద ఉన్న నీటి గుండం లోతు ఎంతో నేటికీ మిస్టరీగా మారింది. చరిత్ర ప్రకారం నల్లమల అటవీ ప్రాంతంలో కురిసిన వర్షాలకు ఆలయ సమీపంలోకి అధికంగా వర్షపు నీరు వచ్చేది. వేల సంవత్సరాలు తపస్సు చేసిన ఓ మహర్షి నెమలి ఆకారాన్ని పొంది నీటి గుండాన్ని తవ్వినట్లుగా అర్చకులు చెబుతున్నారు. లోతు ఎంతో నేటికీ తెలియకపోవడం విశేషం.

సంబంధిత పోస్ట్