ప్రకాశం జిల్లా రాచర్ల లోని శ్రీ నెమలిగుండ్ల రంగనాయక స్వామి ఆలయ దర్శనానికి వెళ్లాలంటే భక్తుడు శుద్ధిగా ఉండాల్సిందేనని ఆలయ చరిత్ర చెబుతుంది. మైలతో ఆలయం వద్దకు వస్తే ఆలయ ప్రాంగణంలో ఉండే తేనెటీగలు వారిని కుట్టి తరిమేస్తాయని పలుమార్లు ఈ ఆలయం వద్ద నిరూపించబడిందని భక్తులు చెబుతున్నారు. ఎంతో మహిమ కలిగిన శ్రీ నెమలిగుండ్ల రంగనాయక స్వామి బ్రహ్మోత్సవాలు ఈనెల 12 నుండి 15వ తేదీ వరకు జరగనున్నాయి.