ప్రకాశం జిల్లా రాచర్ల మండలం జేపి చెరువు గ్రామ సమీపంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ నెమలిగుండ్ల రంగనాయక స్వామి ఆలయ గుండానికి వరదనీరు పోటెత్తింది. శనివారం నల్లమల్ల అటవీ ప్రాంతంలో కురిసిన భారీ వర్షానికి గుండానికి భారీగా వరదనీరు వచ్చి చేరుతుంది. దీంతో గుండంలో జలకళ సంతరించుకుంది. అధికారులు ముందస్తు జాగ్రత్తతో గుండంలోకి ఎవరు ఈతకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.