ప్రకాశం జిల్లా రాచర్ల మండలంలో ఫీల్డ్ అసిస్టెంట్ లక్ష్మీనారాయణ మంగళవారం ఉదయం ఓ వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు. మండలంలో ద్విచక్రవాహనంపై తిరుగుతూ ఉపాధి హామీ పథకం పనులకు పోదాం రండి అంటూ మైకుతో ప్రచారం చేశారు. ఎక్కువ శాతం రోజువారీ కూలీకి వెళ్తూ ఉపాధి హామీ పథకానికి హాజరుకాని వారి కోసమే ఇలా మైకుతో ప్రచారం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. దీంతో సమయం కూడా కలిసి వస్తుందని ఆయన చెప్పారు.