ప్రకాశం జిల్లా రాచర్ల మండలం జెపి చెరువు సమీపంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ నెమలిగుండ్ల రంగనాయక స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆదివారం రంగనాయక స్వామి కళ్యాణ మహోత్సవం కావడంతో భక్తులు 20వేల మందికి పైగా తరలివచ్చారు. ఒకే వేదికపై కళ్యాణ మహోత్సవంలో ప్రస్తుత ఎమ్మెల్యే అశోక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే అన్న వెంకట రాంబాబు ప్రజలకు కనిపించారు. స్వామివారికి ఇరువురు పట్టు వస్త్రాలు సమర్పించారు.