సాంకేతిక లోపంతో రాచర్ల రైల్వే గేట్ తెరుచుకోక దాదాపు గంటకు పైగా గిద్దలూరు పట్టణంలో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. బుధవారం రాత్రి 7 గంటల సమయంలో రైలు గేటు వేసిన అధికారులు గేటును తెరిచే సమయంలో సాంకేతిక లోపంతో తీర్చుకోలేదు. టెక్నికల్ ఇంజనీర్లు అక్కడికి చేరుకొని పరిస్థితిని చక్కదిద్యారు. ట్రాఫిక్ క్లియర్ కావడానికి పోలీసులు గంటకు పైగా శ్రమించారు. గతంలో కూడా ఇలానే పలుమార్లు జరిగిందని వాహనదారులు తెలిపారు.