గిద్దలూరులో వైద్యులు అరుదైన శస్త్ర చికిత్స నిర్వహించారు. శనివారం ఓ ప్రైవేటు వైద్యశాలలో వైద్యులు సావిత్రమ్మ, విరించి యాదవ్, గ్రీష్మ ఓ మహిళకు శస్త్ర చికిత్స చేసి కడుపులోని 3 కేజీల కణితి గడ్డను తొలగించారు. కొన్ని రోజులుగా కడుపు నొప్పితో బాధపడుతున్న మహిళలకు వైద్యం చేసి వైద్యులు ఉపశమనం కల్పించారు. శాస్త్ర చికిత్స తర్వాత మహిళ కోలుకుంటుందని వైద్యులు తెలిపారు. మహిళ బంధువులు వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు.