వారికి సహాయం చేస్తే రివార్డు: కొమరోలు ఎస్సై

70చూసినవారు
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి నిస్సహాయ స్థితిలో ఉన్న వారికి సహాయం చేసే వారికి రివార్డు లభిస్తుందని కొమరోలు ఎస్ఐ నాగరాజు ఆదివారం అన్నారు. ఇటీవల రోడ్డు ప్రమాదాలలో తీవ్రంగా గాయపడి సరైన సహాయం అందక మృతి చెందుతున్న సందర్భాలు చోటు చేసుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీస్, 108 కు ఫోన్ చేయటం లేదా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి రివార్డు పొందాలన్నారు.

సంబంధిత పోస్ట్