రాచర్లలో పల్లెనిద్ర కార్యక్రమం

78చూసినవారు
రాచర్లలో పల్లెనిద్ర కార్యక్రమం
రాచర్ల మండలం రంగారెడ్డిపల్లి గ్రామంలో బుధవారం రాత్రి ఎస్సై కోటేశ్వరరావు ఆధ్వర్యంలో పల్లెనిద్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సైబర్ నేరాలు, దొంగతనాలు అరికట్టే అంశాలు, ఓటీపీ ఫ్రాడ్స్, వివిధ అంశాలపై ప్రజలకు ఎస్ఐ అవగాహన కల్పించారు. దొంగతనాలు నిరోధించేందుకు గ్రామాలలో స్వచ్ఛందంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉంటూ పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్