ప్రకాశం జిల్లా రాచర్ల మండలం అంకిరెడ్డి పల్లె గ్రామంలో శనివారం ప్రమాదవశాత్తు ఆటో బోల్తాపడ్డ సంఘటనలో పదిమందికి పైగా స్వల్ప గాయాలపాలయ్యారు. వారిలో ఇద్దరికి కొంచెం తీవ్రగాయాలు కాగా వారందరినీ గిద్దలూరులోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. గాయపడ్డ వారందరూ వ్యవసాయ కూలీలుగా స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనపై స్థానిక పోలీసులు విచారిస్తున్నారు.