విద్యుత్ షాక్ తో గొర్రెలు మృతి

1056చూసినవారు
విద్యుత్ షాక్ తో గొర్రెలు మృతి
అర్ధవీడు మండలం కాకర్ల గ్రామంలో బుధవారం విద్యుత్ షాక్ వల్ల 13 గొర్రెలు మృతి చెందాయి. రైతు షేక్ మహబూబ్ పీర చెందిన 13 గొర్రెలను గ్రామ సమీపంలోని పొలాలలోకి మేతకు తీసుకెళ్లాడు. ఈ నేపథ్యంలో పొలం కంచెకు పెట్టి ఉన్న విద్యుత్ వైర్లు తగిలి 13 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. మృతి చెందిన గొర్రెల విలువ 3 లక్షల రూపాయల వరకు ఉంటుందని రైతు మహబూబ్ పీర తెలిపాడు. ప్రభుత్వమే తనను ఆదుకోవాలని రైతు వేడుకుంటున్నాడు.

సంబంధిత పోస్ట్