ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలం పందిళ్ళపల్లి గ్రామ సమీపంలోని అమరావతి అనంతపురం జాతీయ రహదారిపై ఆదివారం బేస్తవారిపేట ఎస్సై నరసింహారావు వాహన తనిఖీలు నిర్వహించారు. 2024 అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఉన్నత అధికారులు ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని చెప్పారు. నగదు అక్రమంగా మద్యం తరలింపు వంటి అంశాలపై ప్రత్యేకంగా దృష్టి సారించామని ఎస్సై తెలిపారు.